- Advertisement -
నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండల కేంద్రం సెంటినరీకాలనీ సింగరేణి సీ-2 క్వార్టర్లో శుక్రవారం మధ్యాహ్నం కోట చిరంజీవి(38) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. న్యూమారేడుపాక పోతనకాలనీకి చెందిన చిరంజీవి మీసేవ నిర్వాహకుడు. సెంటినరీకాలానీలోని ఐకేపీ కార్యాలయానికి రాగా ఆ కార్యాలయానికి వచ్చిన ముగ్గురు దుండగులు రాళ్ళతో కొట్టిచంపినట్లు సమాచారం. మృతుని భార్య ఇటీవల చనిపోగా వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉండటమే హత్యకు కారణంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రామగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -