యండి. సలీం.. డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు
నవతెలంగాణ – భువనగిరి
పట్టణ పరిధిలో ఆర్టీసీ బస్సులు పరిమిత వేగంతో నడపాలని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కోరారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసి బస్సులు పట్టణ పరిధిలో వేగంగా నడపడం వలన నలబై రోజుల కాల వ్యవధిలో పద్నాలుగు రోడ్డు ప్రమాదాలు జరిగాయని నలుగురు ప్రాణాలు కోల్పోయారని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు యండి. సలీం అన్నారు.
ఆర్టీసిలో ప్రైవేట్ వారికి అవకాశం కల్పించడం వలన నైపుణ్యం లేని డ్రైవర్లు బస్సులు నడుపుతున్నారన్నారు. పట్టణ పరిధిలో వేగంగా బస్సులు నడుపుతు, సెల్ పోన్ డ్రైవింగ్ చేస్తున్నారన్నారు. అధికారులు దృష్టి సారించి ఇలా వేగంగా నడిపే వారి లైసెన్స్ రద్దు చేయాలన్నారు. రాత్రి తొమ్మిది దాటితే బస్సులు జిల్లా కేంద్రం బస్టాండ్ కి రాకుండ బైపాస్ నుండి వెలుతున్నాయని అన్నారు. అనేక సమస్యలకు నిలయంగ మారిన ఆర్టీసీని అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. ప్రయాణికులకు సౌకర్యం బస్టాండ్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు షేక్ రియాజ్, యండి. సాజిద్, దయ్యాల నవీన్, హరీష్, నేహాల్, సంతోష్ పాల్గొన్నారు.
పట్టణ పరిధిలో ఆర్టీసి బస్సులు పరిమిత వేగంతో నడపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES