Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పరిశీలించిన ఎంపిడీఓ

ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పరిశీలించిన ఎంపిడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని  ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ స్థానిక పంచాయతీ కార్యదర్శి తో కలిసి శుక్రవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లబ్ధిదారులతో మాట్లాడుతూ .. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారులు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేర కు కొలతల ప్రకారం ఇంటి నిర్మాణాలను చేయాలని నిబంధనలకు లోబడి గృహ నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారులకు మూడు విడుదలుగా సంబంధిత ఖాతాలో డబ్బులను నేరుగా జమ చేయడం జరుగుతుందని అన్నారు.

నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా ఎంపీడీవో కార్యాలయానికి రావాలని సమస్యలను తనకు రాతపూర్వకంగా అందించిన పరిష్కరించడానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలంలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయని జిల్లా అధికారుల పరిశీలనలు తెలిసిందని అందుకే మంజూరైన ఇంటి నిర్మాణాలు పరితగతిన నిర్మాణాలు చేపట్టాలని  లబ్ధిదారులకు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు స్థానిక జుక్కల్ జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ , లబ్ధిదారులు,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -