నవతెలంగాణ – మునుగోడు
ఈనెల 10 11 12 తేదీలలో నిజాంబాద్ లో నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనేందుకు మహాత్మా జ్యోతిబాపూలే మునుగోడు బాలికల పాఠశాలకు చెందిన ఏడవ తరగతివ విద్యార్థిని కె తేజశ్రీ ఎంపిక అయింది. శుక్రవారం ఆ పాఠశాల ప్రిన్సిపల్ కే సంధ్య ఈ మాట్లాడుతూ .. పోటీలో పాల్గొనేందుకు వెళ్తున్న తేజశ్రీ కి కోచ్ ఇచ్చే సూచనలను పాటిస్తూ పోటీలో ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయిలో పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని విద్యార్థికి సూచించారు. రాష్ట్రస్థాయి పోటీలలో పోటీపడే విధంగా తమ పాఠశాల విద్యార్థిని కృషి చేసిన తైక్వాండో కోచ్ అంబటి ప్రణీత్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిఈటి నాగమణి , పిడివి విజయ , తైక్వాండో కోచ్ అంబటి ప్రణీత్ ఉన్నారు.
తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికైన తేజశ్రీ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES