Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ వ్యతిరేకి రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహనం

బీసీ వ్యతిరేకి రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహనం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీసీ ద్రోహులైన రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టులో కేసు వేసి స్టే తెప్పించి బీసీ రిజర్వేషన్ నిలుపదల చేయించినందుకు నిరసనగా వారి దిష్టిబొమ్మను తిలక్ గార్డెన్ చౌరస్తాలో శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు దహనం చేశారు.  బిసి జిల్లా నాయకులు నరాల సుధాకర్, సత్య ప్రకాష్ కొయ్యడ శంకర్ లను ముందస్తు అరెస్టు చేసి నాలుగోవ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా పెద్ద ఎత్తున బీసీలు హాజరై నిరసన కార్యక్రమం చేపట్టినారని నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ అన్నారు.

ఎవ్వరు అడ్డుపడిన ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసిన బీసీలకు న్యాయంగా చెందాల్సిన హక్కులను సాధించుకుంటామని అన్నారు, అప్పటివరకు నిరంతర పోరాటం చేస్తామని బిసి ద్రోహులకు తగిన గుణపాఠం నేర్పుతామని బిసి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం గంగ కిషన్ అన్నారు… భవిష్యత్తులో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేస్తామని రాష్ట్ర నాయకులు ఆకుల ప్రసాద్ బసవ సాయిరాజ్ విజయ్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో దర్శనం దేవేందర్ తో పాటు పోల్కం గంగ కిషన్, బగ్గలి అజయ్, విజయ్, శ్రీలత, ఆకుల ప్రసాద్, బసవసాయి, జయ, రుక్మిణి, మాకు రవి, తోట మహేష్, సత్యనారాయణ, బాలన్న మరియు రూరల్ నాయకులు నర్సయ్య, కెంపు సాయిలు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -