నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామంలో లక్సెట్టి మల్లికార్జున్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో రెండు సంవత్సరాల క్రితం బోరు వేశాడు. బోరుబావికి దగ్గర్లోని పక్కనే 300 మీటర్ల దూరంలో నాటి ప్రభుత్వం చెక్ డ్యామ్ నిర్మించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల దాటికి చెక్ డాం కుంట నిండిపోయింది. నాడు అడిగింటిన భూగర్భ జలాలు.. పైకి ఎగబాకుతున్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే నీరు భారీగా ఊట ఊరుతోంది. ప్రస్తుతం వ్యవసాయ భూమిలో సోయా పంట కొత్త దశకు రావడంతో నీరు వాతంటాత అవే గత వారం రోజులుగా నీరు బోరుబావి నుండి పైకి వస్తున్నాయి. దీంతో రైతు బోరు నీటిని పైకి తోడేస్తున్నాడు.
అదేవిధంగా నీటిని మళ్లీంచి తిరిగి కుంటలోకి పైపుల ద్వారా వదిలేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తండోపతండాలుగా వచ్చి బోరుబావిని సందర్శిస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సంబంధిత రైతుకు గట్టుపైన వ్యవసాయ భూమి ఉండడంతో ఇక్కడ బోరు వేసి నీటిని పైప్ లైన్ ద్వారా గట్టుపైకి తరలిస్తూ వస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్నా నీటిని చూస్తూ ప్రజలు, రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎగబాకుతున్న బోరుబావి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES