- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై న్యాయవాది రాకేష్ కిషోర్ దాస్ చెప్పుతో దాడికి పాల్పడడాన్ని ఖండిస్తూ సీపీఐ(ఎం) సింగాయిపల్లి గ్రామ శాఖ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి పై దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి న్యాయవ్యవస్థకు, దేశానికి అవమానమని తెలిపారు. అంతకుముందు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు ఈశ్వర్ రాజు, సింగోటం, రమేష్ భాష తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -