- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టాప్రా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కలెక్టర్ ద్వారా తెలంగాణ చీఫ్ సెక్రటరీ కి పెన్షనర్ల సమస్యలను తెలియజేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏవో జగన్మోహన్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. పెన్షనర్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు అపరి ష్కతంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విన్నవించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కడారి రమేష్ బాబు, బొమ్మకంటి బాలరాజు,జిల్లా ప్రతినిధులు మాటూరి బాలేశ్వర్ బిక్షపతి, మల్లయ్య, రామకృష్ణారెడ్డి, అంబెడ్కర్,, సుధాకరరెడ్డి లు పాల్గొన్నారు.
- Advertisement -