Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ లో ట్రాన్స్పార్మర్ మరమ్మత్తు కేంద్రం మంజూరు.!

కొయ్యుర్ లో ట్రాన్స్పార్మర్ మరమ్మత్తు కేంద్రం మంజూరు.!

- Advertisement -

మంత్రి శ్రీదర్ బాబుకు కృతజ్ఞతలు: మాజీ ఎంపిపి మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని కొయ్యుర్ సబ్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ పార్మర్స్ మరమ్మత్తు కేంద్రం (ఎస్ పి ఎం) మంజూరైనట్లుగా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేలికపాటి అకాల గాలివాన బిభత్సవానికి ట్రాన్స్ఫార్మర్స్ చెడిపోతే మండల రైతులు ఇబ్బందులకు గురై, మరమ్మతులు కోసం కాటారం,జంగెడు,రేగొండ,చిట్యాల తదితర దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నట్లుగా వాపోయారు.

రైతులు ఇబ్బందులను దూరం చేయడానికి కొయ్యుర్ గ్రామంలో మరమ్మత్తు సెంటర్ ఏర్పాటు చేయించాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు దృష్టికి ఇటీవల తీసుకెళ్లినట్లుగా తెలిపారు. ఈ విషయం పై మంత్రి వెంటనే స్పందించి సంబంధించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మత్తు కేంద్రాన్ని మంజూరు చేసినందుకు మండల రైతులు పక్షాన మంత్రి శ్రీదర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా పేర్కొన్నారు. అలాగే మండలంలో 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -