Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కక్షిదారులు మానసిక ఒత్తిడికి లోను కావద్దు

కక్షిదారులు మానసిక ఒత్తిడికి లోను కావద్దు

- Advertisement -

న్యాయమూర్తి వినీల్ కుమార్..
నవతెలంగాణ – బిచ్కుంద 

కక్షిదారులు చిన్న చిన్న విషయాలకు ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురి కకుండా జాగ్రత్తగా ఉండాలని న్యాయమూర్తి వినీల్ కుమార్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద పట్టణంలోని కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవఅధికార సంస్థ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కక్షిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వినీల్ కుమార్ మాట్లాడుతూ కక్షిదారులు, ప్రజలు చిన్న చిన్న విషయాలకు మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురి కాకుండా మానసిక స్థితి పెంపొందించడానికి న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో వైద్యులు ఇచ్చే సలహాలు సూచనలు పాటించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. వైద్యురాలు స్వప్న మాట్లాడుతూ మానసిక ఒత్తిడి వల్ల ఏర్పడే వ్యాధులు ప్రజలను కృంగదీస్తాయని వెంటనే వైద్యులను సంప్రదించి పలు సలహాలు సూచనలు తీసుకొని చికిత్సలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది సుదర్శన్ గౌడ్ బార్ అసోసియేషన్ సభ్యులు ప్రకాష్ , లక్ష్మణరావు, మల్లేష్, విట్టల్ రావు, మహమ్మద్, రవి పటేల్ వైద్య సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -