నవతెలంగాణ- నిజామాబాద్ సిటీ
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రిజనల్ చైర్మన్ ఎల్ఎన్ ఉదయ సూర్య భగవాన్ అధ్యక్షతన నగరంలోని సందీప్ గార్డెన్ లో రీజియన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ‘మెంటల్ వెల్నెస్’ కార్యక్రమాన్ని వరల్డ్ ప్రేసిడెంట్ పిలుపు మేరకు శుక్రవారం దాదాపుగా 300 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్ టి. కేశవ కుమార్ పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు, మనోధైర్యం అనే అంశాలను వివరించారు. వివిధ క్లబ్స్ కు సంబంధించిన అధ్యక్ష , కార్యదర్శి కోశాధికారులు శుక్రవారం ఎల్ఎన్. యాదగిరి, చార్టర్ అకౌంటెంట్ , ఆడిటర్ రీజియన్ అడ్వైజర్ ఎల్ఎన్. లక్ష్మీ నారాయణ, జోన్ చైర్మన్ బి నరసింహారావు , జోన్ చైర్మన్ దారం భూమన్న ల సమక్షంలో ఘనoగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ట్ సిటీ ఆర్థిక కార్యదర్శి ఎల్ఎన్. రవీంద్ర కుమార్ గుప్తా పాల్గొన్నారు.
మెంటల్ వెల్నెస్ అవగాహన ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES