బీసీ రిజర్వేషన్లను అడ్డగిస్తే సహించేది లేదు
బి ఆర్ ఎస్, బిజెపి పార్టీల వైఖరి అనుమానస్పదం
కోర్టు తీర్పు పై కళ్లకు గంతలతో బీసీ సంక్షేమ సంఘం నాయకుల వినూత్న నిరసన
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ఉద్యమ తరహా ఉద్యమాన్ని నిర్మిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు అన్నారు. తేదీ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీవో నెంబర్ 9 పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు ల పై కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు, ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పర్ష హన్మాండ్లు మాట్లాడుతూ బీసీల 42 శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన రాజకీయపరమైన పోరాటం చేస్తామని ఆరు నూరైనా ఏది ఏమైనా 42% రిజర్వేషన్లు సాధించి తీరుతామని అన్నారు.
బీసీ రిజర్వేషన్లను కొందరు వ్యక్తులు అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారని నోటికాడి బుక్కను ఎత్తగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, జనాభా దామాషా ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం బీసీ కులగన చేసి డెడికేషన్ కమిషన్ వేసి చట్టసభలలో బిల్లులు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్, రాష్ట్రపతికి బిల్లులను పంపించారని ఆరు నెలలుగా ఆ బిల్లులను ఆమోదించక పెండింగ్లో పెట్టడం శోచనీయమన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ మేరకు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో కల్పిస్తూ జీవో నెంబర్ 9 ని తీసుకొచ్చిందని ,జీవో నెంబర్ 9 ప్రకారం ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూలు నోటిఫికేషన్ ఇచ్చిందని ఆ జీవో నెంబర్ 9 ప్రకారం స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం కల్పిస్తూ జిఓ ఇచ్చిందని దీనివలన స్థానిక సంస్థల ఎన్నికలలో రాజ్యాధికారం బీసీలకు సాధ్యమైందన్నారు.బీసీ రిజర్వేషన్ల విషయమై అసెంబ్లీలో బిజెపి బీఆర్ఎస్ పార్టీలు బిల్లులకు మద్దతు ఇచ్చాయని బయట మాత్రము ఈ రెండు పార్టీలు బీసీలకు అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాయని పర్ష హన్మాండ్లు అన్నారు, 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు నిరవధిక తెలంగాణ బంద్ కూడా వెనుకాడ బోమని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ జిల్లా అధికార ప్రతినిధి బండారు బాల్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకుడు నంది కిషన్,పద్మశాలి సంఘం జిల్లా నాయకుడు గోలి వెంకటరమణ,యాదవ సంఘం జిల్లా నాయకుడు తోట్ల రాములు యాదవ్, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షుడు వంకాయల కార్తీక్,బీసీ సంఘం నాయకులు బోయినీ శ్రీనివాస్, తోట్ల మల్లేష్ యాదవ్ , భూదం ఆంజనేయులు, బిసి యువజన సంఘం జిల్లా నాయకుడు చెన్నమనేని రాజకుమార్, నాయకులు సామల తిరుపతి ఇల్లంతకుంట తిరుపతి, సామల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు తెలంగాణ తరహా ఉద్యమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES