Saturday, October 11, 2025
E-PAPER
Homeకరీంనగర్సిరిసిల్ల మున్సిపల్ కార్మికుల పెండింగ్ ఈపీఎఫ్ సమస్యలను పరిష్కరించాలి

సిరిసిల్ల మున్సిపల్ కార్మికుల పెండింగ్ ఈపీఎఫ్ సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ డిమాండ్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు టౌన్ మహాసభ  బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృతలాల్ శుక్లా కార్మిక భవన్ లో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోడం రమణ  అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలో సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై గత మూడు సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలను సమీక్షించుకొని ప్రస్తుతం మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమస్యలను చర్చించి రాబోయే రోజుల్లో నిర్వహించబోయే భవిష్యత్తు ఉద్యమ పోరాట కార్యాచరణను రూపొందించుకొని నూతన కమిటీని మరియు మహిళా సబ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్  మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించిన 8 నెలల పి ఆర్ సి బకాయిలను యూనియన్ ఆధ్వర్యంలో పోరాటం చేసి సాధించుకోవడం జరిగిందన్నారు.

సిరిసిల్ల మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ పిఎఫ్ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గౌరవ అధ్యక్షులుగా  సుల్తాన్ నర్సయ్య, అధ్యక్షులుగా  ఏర్పుల బాలయ్య, ఉపాధ్యక్షులుగా  నర్మెట బాబా కిషన్ , కలికోట అరుణ్ , కొమ్ము యశోద, కార్యదర్శిగా కోడం రమణ,సహాయ కార్యదర్శులుగా బత్తుల దేవరాజు , అనుముల స్వామి , బడుగు శ్రీనివాస్,
ముఖ్య సలహాదారులుగా కర్నె మల్లేశం, కోశాధికారిగా -మారుపాక లక్ష్మి, సహాయ కోశాధికారిగా  నర్మట ఉమ, సిరిసిల్ల మున్సిపల్ యూనియన్ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ కన్వీనర్ గా రెడ్డి మల్ల మమత, కో కన్వీనర్ గా పెరుమాండ్ల ఎల్లవ్వ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మహాసభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ , జిల్లా సహాయ కార్యదర్శి సూరం పద్మ , మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసారపు శంకర్ సిఐటియు జిల్లా నాయకులు జిందం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -