సురేష్‌ప్రొడక్షన్స్ మినీ ప్రజెంట్ చేస్తున్న సిరీస్ ‘ఆనందలహరి’. తూర్పు, పశ్చిమ గోదావరి నేపథ్యంలో సాగే హార్ట్ టచ్చింగ్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ. ప్రేమ, నవ్వులు కలిపిన ఈ సిరీస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. ఈ సిరీస్‌ను 13వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సాయి వనపల్లి రచన, దర్శకత్వం వహించగా, ప్రవీణ్ ధర్మపురి నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ని సురేష్ దగ్గుబాటి సురేష్‌ప్రొడక్షన్స్ మినీ బ్యానర్ పై సమర్పిస్తున్నారు.
ఈ బ్యానర్ ద్వారా యువ దర్శకులు, రచయితలు, టెక్నీషియన్లకు తమ కథలు, ఆలోచనలను అత్యుత్తమ నాణ్యతతో రూపొందించడానికి అవకాశం కల్పించడం సురేష్‌బాబు లక్ష్యం. రామానాయుడు స్టూడియోస్‌లో ఆధునిక సదుపాయాలతో ఈ కలను ఈ బ్యానర్ నిజం చేస్తోంది. అభిషేక్ బొడ్డేపల్లి, భ్రమరాంబిక టుటిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కి జాయ్ సోలమన్ సంగీతాన్ని అందించారు. ఈ దీపావళి కానుకగా ఈనెల 17న ‘ఆహా’లో విడుదల కానుంది.
ప్రేమ, నవ్వుల ‘ఆనందలహరి’
- Advertisement -
- Advertisement -