నేటి నుంచి ఢిల్లీ అంచె పోటీలు
న్యూఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్ (పీకెఎల్) సీజన్ 12 ప్లే ఆఫ్స్ షెడ్యూల్ వచ్చేసింది. నేటి నుంచి ఢిల్లీ అంచె పోటీలు ఆరంభం కానుండగా.. ఈ నెల 23న లీగ్ దశ మ్యాచులకు తెరపడింది. 25న ప్లే ఇన్స్ మ్యాచుల్లో పాయింట్ల పట్టికలో 5 నుంచి 8వ స్థానంలో నిలిచిన జట్లు రేసులో సజీవంగా నిలిచేందుకు పోటీపడుతున్నాయి. ఈ ఏడాది సరికొత్త ఫార్మాట్లో సాగుతున్న లీగ్‌లో టైటిల్ రేసులో ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. 26 నుంచి 29 వరకు ప్లే ఆఫ్స్‌లో ఎలిమినేటర్స్, క్వాలిఫయర్స్ ఉంటాయి. 31న టైటిల్ పోరు షెడ్యూల్ చేశారు. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియం పీకెఎల్ ప్లే ఆఫ్స్‌కు వేదిక కానుంది. దబంగ్ ఢిల్లీ కెసి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగిలిన ఏడు స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ సారి తెలుగు టైటాన్స్ సైతం ప్లే ఆఫ్స్ రేసులో ముందంజలో కొనసాగుతుంది.