Saturday, October 11, 2025
E-PAPER
Homeఆటలురాఫ్టర్స్‌ సహ యజమానిగా తరుణ్‌ భాస్కర్‌

రాఫ్టర్స్‌ సహ యజమానిగా తరుణ్‌ భాస్కర్‌

- Advertisement -

హైదరాబాద్‌ పికిల్‌ బాల్‌ లీగ్‌ 2025
హైదరాబాద్‌ : శుక్రవారం ఆరంభమైన హైదరాబాద్‌ పికిల్‌బాల్‌ లీగ్‌ (హెచ్‌పీఎల్‌) తొలి సీజన్‌కు సినీ గ్లామర్‌ సైతం తోడైంది. హెచ్‌పీఎల్‌ ప్రాంఛైజీ రాఫ్టర్స్‌ సహ యజమానిగా సినీ నటులు, దర్శకులు దాస్యం తరుణ్‌ భాస్కర్‌ చేరారు. రాఫ్టర్స్‌కు ప్రియాంక రెడ్డి, కౌశిక్‌ మానెపల్లి యజమానులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ‘స్టోరీ టెల్లింగ్‌, స్పోర్ట్స్‌కు ఓ సారూప్యత ఉందని నమ్ముతాను. ఈ రెండింటికి ప్రజలను ఏకం చేసి, స్ఫూర్తినిచ్చే, ఉత్తేజపరిచే శక్తి ఉంది. హైదరాబాద్‌ పికిల్‌ బాల్‌ లీగ్‌లో రాఫ్టర్స్‌ ప్రాంఛైజీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. లీగ్‌, టీమ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతు సహకారం అందిస్తాను’ అని తరుణ్‌ భాస్కర్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -