నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్యులు, వైద్య విద్యార్థుల కోసం ఇడి టి-జుడా కనెక్ట్ పేరుతో మానసిక ఆరోగ్య హెల్ప్ డెస్క్‌ను, పీర్ సపోర్ట్‌ను తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన వేరు వేరు కార్యక్రమాల్లో దీనికి సంబంధించిన పోస్టర్‌ను వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టీనా జెడ్ చొంగ్తూ, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్, టీపీసీసీ వైద్య విభాగం చైర్మెన్ డాక్టర్ ఎం.రాజీవ్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మెన్ డాక్టర్ కె.మహేశ్ కుమార్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఆవిష్కరించారు.
ఆయా కార్యక్రమాల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ డి.లాలయ్య, సభ్యులు డాక్టర్ విష్ణు, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇంద్ర పాల్గొన్నారు. గత ఐదేండ్లలో దేశంలో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు జాతీయ వైద్య కమిషన్ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శిక్షణ పొందిన సహచరులు, మెంటర్లు ఈ హెల్ప్‌లైన్ గోప్యంగా నిర్వహించనున్నారు. దీని ద్వారా వారికి కౌన్సెలింగ్, సూచనలు, వృత్తిపరమైన మానసిక సహాయం, అధిక ఒత్తిడి సమయాల్లో నియమిత వెల్‌నెస్ చెక్-ఇన్స్ తదితర సేవలందించనున్నారు. ఇతరులకు చికిత్సనందిస్తున్న వైద్యులు తమను తాము కూడా నయం చేసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఐజాక్ న్యూటన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు.
వైద్యులు, వైద్య విద్యార్థుల కోసం మానసిక ఆరోగ్య హెల్ప్ డెస్క్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES