మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
టాప్రా ఆధ్వర్యంలో వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని పెన్షనర్ల నిరసన
నవతెలంగాణ-నల్లగొండ
పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయాదాక్షిణ్య బిక్షకాదని, అది పెన్షనర్ల హక్కు అని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం.మోతిలాల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లా డుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన సీపీఎస్, ఎన్పీఎస్, యూపీఎస్ పెన్షన్ విధా నాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల హక్కులను హరించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయా లని, 8వ పీఆర్‌సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్లకు పెన్షన్ విధానాన్ని రివైజ్ చేయాలని, బ్యాంకు పెన్షనర్లకు పెన్షన్ అప్‌డేట్ చేయా లని, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్‌ను మంజూరు చేయాలని కోరారు.
టాప్రా జిల్లా అధ్యక్షులు నూకల జగదీష్ చంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు 5 విడతల కరువు భత్యాన్ని మంజూరు చేయాలని, రెండవ పీఆర్‌సీని ప్రకటించి 30 శాతం ఫిట్‌మెం ట్ ఇవ్వాలని తెలిపారు. ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బకాయిలను, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టాప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్, జిల్లా గౌరవాధ్యక్షులు కుకుడాల గోవర్ధన్, బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు కొప్పు రామచంద్రం, కేసాని భిక్షం రెడ్డి, టాప్రా రాష్ట్ర కమిటీ సభ్యులు వనం వాణిశ్రీ, వాడపల్లి రమేష్, గుండాల బిక్షమయ్య, రాఫెల్, రాపోలు వెంకటేశం, పట్టేటి కృష్ణయ్య, చాపల అంజిరెడ్డి, భావన ఋషి, ఎస్కే అక్బర్ హుస్సేన్, గాదె నరసింహ, రిటైర్డ్ జూనియర్ లెక్చరర్ సంఘం నాయకులు ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ ప్రభుత్వ బిక్షకాదు.. హక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES