Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చోరీకి గురైన ఫోన్లు బాధితులకు అప్పగింత

చోరీకి గురైన ఫోన్లు బాధితులకు అప్పగింత

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల పరిధిలో ఇటీవలి కాలంలో దొంగతనానికి గురైన రెండు మొబైల్ ఫోన్లను గుర్తించి, వాటిని బాధితులకు అప్పగించినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ  జి.అనిల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో రికవరీ చేసిన ఫోన్లను ఇద్దరు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ  అనిల్ రెడ్డి మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు చోరీకి గురైన బాధితులు సీఈఐఆర్‌ పోర్టల్ ద్వారా తమ ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు. చోరీ జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా దొంగతనమైన మొబైల్ ఫోన్‌లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించవచ్చన్నారు. చోరీ జరిగిన ఫోన్ ల వివరాలను సీఈఐఆర్‌ పోర్టల్ లో ఎంట్రీ చేసి రికవరీలో సహాయపడిన మహిళ  పోలీస్ కానిస్టేబుల్ జి. వసుధ ను ఎస్ఐ అనిల్ రెడ్డి అభినందించారు. పోగొట్టుకున్న పోలను రికవరీ చేసి అప్పగించిన ఎస్ఐ అనిల్ రెడ్డికి, పోలీస్ సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -