Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తర్నికల్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం..

తర్నికల్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం..

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి
కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ సర్పంచ్ , మాజీ ఎంపిటిసి చెన్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు లేక  దొంగతనాలు, ప్రమాదాలు జరుగుతున్నాయి. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, స్వీయారక్షణ కోసం, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. వీటి ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమన్నారు. గ్రామాల్లో అనుమానంగా సంచరించే వ్యక్తుల సామాచారం, అసాంఘిక కార్యకలాపాల పాల్పడే వారిని ఇట్టే పసిగట్టేయొచ్చని వారు తెలిపారు.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని తన సొంత డబ్బులు (రూ.7 లక్షలు)తో గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నందుకు గ్రామస్తులు పవన్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీసీ కెమెరాలు ఉండడంవల్ల గ్రామంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని గ్రామస్తులు అన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు  నిజాముద్దీన్,ప్రశాంత్, జహంగీర్, యూసుఫ్, కావాలి మల్లేష్, సుధాకర్, హుస్సేన్,మహేష్, కొండల్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -