Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లారంలో తాగునీటి ఎద్దడి.!

మల్లారంలో తాగునీటి ఎద్దడి.!

- Advertisement -

పట్టించుకోని మిషన్ భగీరథ అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని మల్లారం గ్రామంలో గత రెండు వారాలుగా తాగునీటి ఎద్దడి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రధాన రోడ్డు, సబ్ స్టేషన్ పరిధిలో లీకేజీ కావడంతో నీటి సరఫరా నిలిసిపోయిందని గ్రామస్థులు చెబుతున్నారు. పైప్ లైన్ మరమ్మతులు చేసి నీరు అందించాలని పలుమార్లు మిషన్ భగీరథ అధికారులు,సిబ్బందికి విన్నవించినా పట్టించుకోవడం లేదని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ ట్యాoకర్ ద్వారా నీటిని సరఫరా చెసిన నీరు సరిపోవడం లేదంటున్నారు.గ్రామంలో ఎక్కువగా నీటి సమస్య ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉందని చెబుతున్నారు.మిషన్ భగీరథ సిబ్బంది పైప్ లైన్ లీకేజీని కనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా మిషన్ భగీరథ ఉన్నతాధికారులు పట్టించుకొని లికేజీని గుర్తించి పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టి తాగునీటిని అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -