ఆకుల పాపయ్య సీపీఐ(ఎం ఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై కాలి బూటు విసరడం అది ముమ్మాటికి విద్వేష రాజకీయాల్లో భాగమే అని దిన్ని న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. శనివారం న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆకుల పాపయ్య గారు మాట్లాడుతూ గతంలో తినే తిండి పై దాడి చేశారు. పేదల ఇండ్లపై బుల్డోజర్లు పంపి వాటిని కూల్చేశారు వీటిపై జస్టిస్ గవాయ్ అది సరైన పద్ధతి కాదని అన్నందుకు, వాటిని తిరస్కరించి నందుకు మతం ముసుగులో విద్వేషంతో న్యాయమూర్తి పై కుల దాడి చేశారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కులం, మతం, దేవుడి పేరుతో రాజకీయాలు తప్ప ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది లేదు. యువతను మద్యానికి, సోషల్ మీడియాకు బానిసలను చేసి ప్రశ్నించకుండా ఉద్రిక్త, విద్వేష, ఘర్షణ రాజకీయాలు తప్ప దేశ అభివృద్ధి రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు.
గతంలో చాలా కేసుల్లో దేవుడి గుడులపై న్యాయమూర్తులు కేసుల విచారణ సందర్భంగా ఎన్నో మాటలు, తీర్పులు ఇచ్చిన ఎవరు స్పందించలేదని కేవలం దళిత న్యాయమూర్తి కాబట్టే అసహనంతో బూటు దాడి జరిగిందని అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి వ్యతిరేకత రావడంతో ప్రధాని ఖండించారని, లేదంటే మతం ముసుగులో దేవుడి పేరుతో న్యామూర్తిని కట్టడి చేయడానికి పన్నిన కుట్రలో బాగానే ఈ దాడి అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నగర కార్యదర్శి నీలం సాయిబాబా, వనమాల సత్యం, అబ్దుల్, శివ కుమార్ పాల్గొన్నారు.