- Advertisement -
పవర్లూమ్ పరిశ్రమలో మంటలు
నవతెలంగాణ – తంగళ్లపల్లి
తంగళ్ళపల్లి మండలం బద్దెన పల్లి టెక్స్ టైల్ పార్కులో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టెక్స్ టైల్ పార్కులోని కళ్యాడపు సుభాష్ కు సంబంధించిన టెక్స్ టైల్ పవర్లూమ్ పరిశ్రమలో కార్మికులు నడిపిస్తున్న పవర్ లూమ్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చేరలేగాయి. అక్కడే ఉన్న కార్మికులు గమనించి మంటలను ఫైర్ సేఫ్టీ తో మంటలను ఆర్పి వేయడంతో ప్రమాదం జరగకుండా నివారించారు. అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకొని మంటలు వ్యాప్తి చెందకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు.తంగళ్లపల్లి పోలీసులు సైతం టెక్స్ టైల్ పార్కు వద్దకు చేరుకొని ప్రమాద పరిస్థితిని పర్యవేక్షించారు.
- Advertisement -