– పోలీసుల దర్యాప్తులో నిజాలు తేలుతాయి: జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి శనివారం ఆకస్మిక తనకి చేశారు. ఈనెల ఏడవ తేదీన అనుమానాస్పద స్థితిలో విద్యార్థి వివేక్ మృతి చెందిన స్థలాన్ని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థి మృతి చెందడం బాధాకరమైన విషయమని గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ ను ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి మృతి పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, పోలీసుల విచారణలో మృతికి గల కారణాలు బయటపడతాయన్నారు. విద్యార్థి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచన చేస్తున్నామన్నారు. అదేవిధంగా హాస్టల్ కు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయిస్తున్నరన్నారు. ఈ కార్యక్రమంలో వెన్నె రాజు, అరే కిషోర్ రమేష్ నాయక్, మహేందర్, రాజు ఉన్నారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి బాధాకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES