నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని రాంనగర్ కాలనీలోని మామిడి చెట్టు పైకి ఎక్కి గొడ్డలితో కొమ్మలు కొట్టుచుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఒకరు మృతి చెందినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ శనివారం తెలిపారు. రాంనగర్ కాలనీకి చెందిన రామకృష్ణ ఇంటికి సంతోష్ నగర్ కు చెందిన ప్రేమ్ అనే వ్యక్తి , ఒక ఆడ మనిషి , ఒక మగ మనిషి మామిడి చెట్టు కొట్టడానికి వచ్చి వెయ్యి రూపాయలకు మాట్లాడుకున్నారని తెలిపారు. అ ముగ్గురిలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి ( 40,) సంవత్సరాలు ఉంటాయని, ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి కింద పడగా తలకు బలమైన గాయాలవగా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కొరకు జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి యొక్క వివరాలు ఇప్పటివరకు తెలియ రాలేదని జీన్స్ ప్యాంటు, తెల్లని బనియన్ వేసుకొని ఉన్నాడని ఎస్ సి హెచ్ ఓ తెలిపారు.
ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES