Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అండర్-17 విద్యార్థులకు ఆటల పోటీల నిర్వహణ

అండర్-17 విద్యార్థులకు ఆటల పోటీల నిర్వహణ

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా , భీంగల్ అర్బన్ జోన్ లెవెల్ సెలక్షన్స్ ఈరోజు కృషి హై స్కూల్ భీమ్గల్ నందు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 13 స్కూల్స్ యొక్క అండర్ 14 అండర్ 17 కబడ్డీ, వాలీబాల్ బాల బాలికలు ఇందులో పాల్గొనడం జరిగింది. మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను భీంగల్ అర్బన్ జోన్ కి ఎంపిక చేసి ఈనెల 13వ తేదీన సోమవారం రోజు నిజామాబాద్ డిఎస్సి గ్రౌండ్ లో జరగబోయే జిల్లా స్థాయి కబడ్డీ అండర్ 14 ఇయర్స్ బాలబాలికలు, వాలీబాల్ అండర్ 17 ఇయర్స్ బాలబాలికల యొక్క టీమ్లను పంపడం జరుగుతుందని భీంగల్ అర్బన్ జోన్ ఆర్గనైజ్ సెక్రెటరీ సదమస్తుల రమణ తెలియజేశారు. మీ యొక్క ప్రారంభ కార్యక్రమానికి, ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీంగల్ మండల ఎంఈఓ డి స్వామి పాల్గొని ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కృషి హై స్కూల్ యాజమాన్యం అజిత్ రెడ్డి, పిఆర్టియు మండల అధ్యక్షులు ఎడ్ల శేఖర్, పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వినోద్,టీ యు రాష్ట్ర కార్యదర్శి మురళి,వ్యాయామపి ఆర్ టి యు ఉపాధ్యాయులు నరేష్, లింగం, అభిషేక్, శేఖర్, సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -