Sunday, October 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బీసీ రిజర్వేషన్లకు బీజేపే అడ్డు

బీసీ రిజర్వేషన్లకు బీజేపే అడ్డు

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
42 శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడిందని సారంగాపూర్, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్లు అబ్ధుల్ హాది,సోమా భీమ్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొట్టే శేఖర్ లు అన్నారు. శనివారం మండలంలోని విలేకర్ల సమావేశం లో మాట్లాడారు..స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు పట్టం కడతారని నేపంతోనే బీజేపీ నాయకులు కోర్టుల్లో కేసు వేసి అడ్డుకోవడమే కాక కాంగ్రెస్ పార్టీ పై విమర్శిస్తున్నారని అన్నారు. 

బీసీ బిల్లు రాష్ట్రపతి, గవర్నర్ల దగ్గర ఆగిపోవడంతో బీసీల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోందన్నారు. అన్ని పార్టీల ఆమోదంతో తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ కు పంపితే పెండింగ్లో పెట్టి పైగా నెపం కాంగ్రెస్ ప్రభుత్వం పై నెట్టడం బీజేపీ నాయకులకే చెల్లిందన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లుకు ఆమోదం తెలిపేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్,కైలాస్,రాజేశ్వర్,రమేష్,సుమన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -