Sunday, October 12, 2025
E-PAPER
Homeజిల్లాలు15 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత: ఇంచార్జ్ ఎస్సై సురేష్

15 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత: ఇంచార్జ్ ఎస్సై సురేష్

- Advertisement -

నవతెలంగాణ – ధన్వాడ 
ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనంలో అక్రమంగా పిడిఎస్ రైస్ తరలిస్తుంటే ఎమ్నోన్ పల్లి  గ్రామ శివారులో టాస్క్ ఫోర్స్ ధన్వాడ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పీడీఎస్ రైస్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారిని విచారించగా .. నర్వ మండలంలో పలు గ్రామాల్లో పీడీఎస్ రైస్ సేకరించి కర్ణాటక తీసుకెళుతున్న బొలెరో డ్రైవర్ నరేందర్, ఓనర్ బాలరాజు, శ్రీరామ్ నగర్ కాలనీ,..మక్తల్  15.60 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకొని DT పంచనామా అనంతరం డ్రైవర్, ఓనర్ల లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ధన్వాడ ఇంచార్జ్ ఎస్సై సురేష్ తెలిపారు.

ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా పిడిఎస్ రైస్ నిల్వ ఉంచిన రవాణా చేసిన ఇతరులకు అమ్మిన అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ గారు హెచ్చరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -