నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మికుంట మండలంలోని కోరపెల్లి గ్రామానికి చెందిన తాటి కంటి నాగరాజు(28) డిగ్రీ చదువుకొని ఆర్మీలో అన్ని టెస్టులు క్వాలిఫై అయ్యాడు. చివరికి తం ఇంప్రెషన్ విషయంలో ఆ జాబు రాకుండా రిజెక్ట్ అయింది .అప్పటినుండి మానసికంగా డిస్టర్బ్ అయి ఇంట్లోనే ఫోన్ చూసుకుంటూ, ఏం పని చేయకుండా ఉండేవాడు. అయినా కూడా ఎప్పటికీ అదే విషయం మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉండేవాడు. ఈ నెల 10 శుక్రవారం రాత్రి అందాజ 9 గంటలకు తన తండ్రి సమ్మయ్య అన్నం తింటున్న సమయంలో నాగరాజు తన ఫోన్ ను ఇంట్లోనే వదిలివేసి, ఇంట్లో ఏ విషయం చెప్పకుండా, ఇంట్లో నుండి వెళ్లిపోయినాడు. తండ్రి సమ్మయ్య శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు.
కోరపెల్లిలో యువకుడు మిస్సింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES