Sunday, October 12, 2025
E-PAPER
Homeకరీంనగర్రిటైరైన బీడీ కార్మికులకు పిఎఫ్, పెన్షన్ రూ.7500 అందించాలి

రిటైరైన బీడీ కార్మికులకు పిఎఫ్, పెన్షన్ రూ.7500 అందించాలి

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
బీడీ కార్మికుల పిఎఫ్ డబ్బులను పెట్టుబడిదారులకు కేంద్ర బిజెపి ప్రభుత్వం  దోచిపెడుతుందని రిటైర్డ్ అయిన బీడి కార్మికులకు పిఎఫ్ పెన్షన్ 7500 అందించాలని సిఐటియు బీడీ వర్కర్స్ సిగార్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీరాముల రమేష్ చంద్ర అన్నారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి సూరం పద్మ తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడుతు ప్రతి బీడీ కార్మికులు రెక్కలే ఆస్తులుగా చేసుకొని శ్రమిస్తూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారనీ అన్నారు. అనారోగ్యాల బారిన పడుతూ ఒత్తిడిలకు గురవుతున్న కుటుంబాన్ని పోషించుకోవడానికి బీడీ కార్మికురాలుగా శ్రమిస్తూ జీవితం కొనసాగిస్తూ ఉంటారనీ ఆయన వివరించారు. 

బీడీ కార్మికులకి రిటైర్మెంట్ అయిన తర్వాత పిఎఫ్ పెన్షన్ ద్వారానే వాళ్లు జీవితాన్ని గడుపుకునే అవకాశం ఉంటుంది.ఆ బీడీ కార్మికురాలు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవ్వాల్సిన పిఎఫ్ పెన్షన్  కేంద్ర బిజెపి ప్రభుత్వం అతి తక్కువగా 500, 600, 800, 1000 లు గా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ విధానాన్ని పూర్తిగా  వ్యతిరేకిస్తున్నామనీ,  ఎవరైతే అర్హులైన రిటైర్మెంట్ అయిన బీడీ కార్మికులకి నెలకు.7500  రూపాయలు పిఎఫ్ పెన్షన్ గా  బీజేపీ ప్రభుత్వాo తప్పనిసరిగా అందించాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారుకార్మికుల  పిఎఫ్ డబ్బులు కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారనీ  వారు పేర్కొన్నారు. పెన్షన్ అందించని పక్షాన కార్మికులందరినీ పూర్తిస్థాయిలో పోరాటానికి సన్నద్ధం చేసి హక్కును సాధించేవరకు ముందుకెళ్తామని  అన్నారు. సమావేశంలో కోశాధికారి జిందo కమలాకర్.  పోషమల్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -