Sunday, October 12, 2025
E-PAPER
Homeసినిమాఅభిమానుల కోసం..

అభిమానుల కోసం..

- Advertisement -

హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘కె-ర్యాంప్‌’. హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బ్యానర్స్‌ పై రాజేష్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జైన్స్‌ నాని దర్శకుడు.
దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్‌ జైన్స్‌ నాని మాట్లాడుతూ,’ట్రైలర్‌ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నా. ట్రైలర్‌లోని ఎనర్జీకి సినిమా ఏమాత్రం తగ్గదు. కిరణ్‌ పర్‌ ఫార్మెన్స్‌ ఎంజారు చేస్తారు. హీరోయిన్‌ క్యారెక్టర్‌ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. నరేష్‌ క్యారెక్టర్‌ రివీల్‌ చేయొద్దనే ట్రైలర్‌లో ఆయన డైలాగ్స్‌ పెట్టలేదు. సినిమా చూసి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా. మిమ్మల్ని మూవీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది’ అని అన్నారు. ‘కిరణ్‌ ఫ్యాన్స్‌కు నేను చెబుతున్నా. ఆయన పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్‌, మా డైరెక్టర్‌ మహేశ్‌ బాబు ఫ్యాన్‌, నేను బాలకృష్ణ అభిమానిని.

నా అభిమాన హీరో స్టైల్‌లో తొడగొట్టి చెబుతున్నా ఈ దీపావళికి వస్తున్న నాలుగు సినిమాలు హిట్‌ కావాలి. అందులో మన తెలుగు హీరో కిరణ్‌ చేసిన ఈ సినిమా ఒక మెట్టు పైనే ఉండాలి’ అని ప్రొడ్యూసర్‌ రాజేష్‌ దండా చెప్పారు. హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. ఇంత భారీగా వస్తారని మేమూ ఊహించలేదు. కొత్త స్క్రిప్ట్‌ చేద్దామనే ఉద్దేశంతో ‘క’ అనే సినిమాను చేశాను. అయితే ఈ సినిమా మాత్రం మీకోసం, నా ఫ్యాన్స్‌ కోసం చేశాను. ఈ మూవీకి కర్త కర్మ క్రియ అన్నీ దర్శకుడు నానీనే. ఈ సినిమా చేస్తున్నంతసేపూ నా నవ్వు ఇలాగే ఉంది. అంత బాగా నన్ను మా ప్రొడ్యూసర్స్‌ చూసుకున్నారు. ఈ చిత్రంలో నా క్యారెక్టరైజేషన్‌ ఇప్పుడున్న జనరేషన్‌ యూత్‌కు దగ్గరగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఫ్రస్టేషన్‌తో వాళ్లు ఎలా మాట్లాడుతారో నేనూ అలాగే మాట్లాడుతా. అయితే డైలాగ్స్‌ సందర్బాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవు. గత దీపావళి కంటే ఈ దీపావళి ఇంకా బాగుంటుంది. నన్ను నమ్మండి. మీరు థియేటర్స్‌లో గట్టిగా నవ్వుకుంటారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -