Sunday, October 12, 2025
E-PAPER
Homeఆటలుచాంపియన్‌ చైనా

చాంపియన్‌ చైనా

- Advertisement -

భారత్‌కు కాంస్య పతకం
ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌

గువహటి : ప్రతిష్టాత్మక సుహందినత కప్‌లో ఆతిథ్య భారత్‌ కాంస్య పతకం సాధించింది. గువహటిలోని నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో జరిగిన బిడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌ శనివారం ఘనంగా ముగిసింది. సెమీఫైనల్లో ఓడిన భారత్‌, జపాన్‌లు కాంస్య పతకాలు దక్కించుకోగా.. శనివారం జరిగిన ఫైనల్లో ఇండోనేషియాపై ఘన విజయం సాధించిన చైనా రికార్డు 15వ సారి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో 45-30, 45-44తో వరుస సెట్లలో ఇండోనేషియాపై చైనా పైచేయి సాధించింది. ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌ (మిక్స్‌డ్‌ టీమ్‌)లో భారత్‌ మెడల్‌ సాధించటం ఇదే ప్రథమం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -