నవతెలంగాణ – అశ్వారావుపేట
ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి,అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లు సోమవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,పంచాయితీ రాజ్ ఏఈఈ అక్షిత లు ఆదివారం వారి పర్యటనా షెడ్యూల్ ను ప్రకటించారు. 2024 – 2025 ఆర్ధిక సంవత్సరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పధకం లో రూ. 1 కోటీ 70 లక్షల 20 వేల నిధులతో మండలంలో అశ్వారావుపేట,పేరాయిగూడెం,కన్నాయిగూడెం,కావడిగుండ్ల పంచాయితీ చెన్నాపురం లో నిర్మించిన సిమెంట్ రోడ్లు,మురుగు కాలువలు ను ప్రారంభించనున్నారు.ఈ టూర్ ఉదయం 9 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. ఆయా పంచాయితీల క్షేత్రస్థాయి సిబ్బంది,మండల స్థాయి అధికారులు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
నేడే ఎంపీ రామ సహాయం, ఎమ్మెల్యే జారే పర్యటన…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES