Sunday, October 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

- Advertisement -

నలుగురు దుర్మరణం..పలువురికి గాయాలు
ఫుట్‌బాల్‌ ఆట ముగిసాక విచక్షణా రహితంగా కాల్పులు


వాషింగ్టన్‌ : గన్‌ కల్చర్‌ అమెరికాను వణికిస్తున్నది. అక్కడ మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిప్పీ రాష్ట్రంలోని ఓ పాఠశాల సమీపంలో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 12మందికిపైగా గాయపడ్డారు. పోలీసుల వెల్లడించిన సమాచారం ప్రకారం.. శుక్రవారం రాత్రి మిస్సిస్సిప్పి రాష్ట్రం లేలాండ్‌ నగరంలో అర్ధరాత్రి ఫుట్‌బాల్‌ ఆట ముగిసిన తర్వాత ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారని ప్రముఖ వార్త సంస్థ బీబీసీ నివేదించింది. శుక్రవారం రాత్రి రద్దీగా ఉండే సమయంలో లేలాండ్‌ ప్రధాన వీధిలో కాల్పులు జరిగాయని నగర మేయర్‌ మేయర్‌ జాన్‌ లీ తెలిపారు.

ఈ కాల్పుల ఘటనకు ముందు ఓ స్కూల్‌ సమీపంలో పాఠశాలల పూర్వ విద్యార్థులను స్వాగతించే వార్షిక అమెరికన్‌ సంప్రదాయ ఫుట్‌బాల్‌, ఇతర కమ్యూనిటీ ఈవెంట్‌లు జరిగాయి. ఈ ఈవెంట్‌లో నిందితుడు కాల్పులకు తెగబడినట్టు సమాచారం. కాల్పులతో వేడుక విషాదంగా ముగిసింది. అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారనీ, నిందితుల్ని గుర్తించేందు ప్రత్యక్షసాక్షులు ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా కాల్పులు జరిపింది 18 ఏండ్ల యువకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. అమెరికాలో ఉన్న గన్‌కల్చర్‌.. అక్కడ ఇలాంటి కాల్పులకు కారణమవుతున్నది. గత కొన్నేండ్లుగా ఇలాంటి కాల్పుల ఘటనలతో పదుల సంఖ్యలో అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ అక్కడి యంత్రాంగాలు ఈ విషయంలో ఎలాంటి శ్రద్ధా చూపకపోవటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -