- Advertisement -
ముంబయి : ప్రీమియం బైకుల తయారీ కంపెనీ జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ ప్రస్తుత పండగ సీజన్‌లో రూ.999తోనే తమ మోటార్ సైకిళ్లను ప్రీబుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. జావా లేదా యెజ్డీ మోటార్ సైకిల్‌ను తమ వెబ్‌సైట్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. 350 సిసి లోపు ఎనిమిది పెర్ఫార్మెన్స్ క్లాసిక్ మోటార్ సైకిల్స్‌పై జిఎస్‌టిని తగ్గించినట్లు జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శరద్ అగర్వాల్ తెలిపారు. జిఎస్‌టి సవరణ తర్వాత తమ బైకుల ధరలు రూ.1.5 లక్షల నుంచి ప్రారంభవుతున్నాయన్నారు. వీటిపై నాలుగు సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్ల వరకు వారంటీని అందిస్తున్నామన్నారు.
- Advertisement -