Sunday, October 12, 2025
E-PAPER
Homeసినిమా'మిత్రమండలి'కి సెన్సార్‌ ప్రశంసలు

‘మిత్రమండలి’కి సెన్సార్‌ ప్రశంసలు

- Advertisement -

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ ఎం జంటగా విజయేందర్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘మిత్రమండలి’. బీవీ వర్క్స్‌ బ్యానర్‌ పై బన్నీ వాస్‌ సమర్పణలో సప్తాస్వ మీడియా వర్క్స్‌ మీద కళ్యాణ్‌ మంతెన, భాను ప్రతాప, డా.విజేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు. ఈ మూవీ ఈనెల 16న రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో సెన్సార్‌ కార్యక్రమాల్ని కూడా పూర్తి చేసుకుని, ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా గురించి సెన్సార్‌ బృందం స్పందించింది. ‘మిత్ర మండలి’ ఆద్యంతం వినోదభరితంగా ఉందని, సమాజంలోని వ్యవస్థల మీద సున్నితంగా విమర్శనాస్త్రాల్ని సంధించారని కొనియాడారు. ఈ సినిమాని బడ్డీ కామెడీ యాంగిల్‌లో చూపిస్తూనే మంచి సెటైరికల్‌ మూవీగా తెరకెక్కించారని అభినందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన చిత్రమని ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.

ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేలా ‘మిత్ర మండలి’ ఉందన్నారు. ప్రియదర్శి, నిహారిక ట్రాక్‌.. విష్ణు ఓయి, రాగ్‌ మయూర్‌, ప్రసాద్‌ బెహరా కామెడీతోపాటు స్పెషల్‌ అట్రాక్షన్‌గా వెన్నెల కిషోర్‌, సత్య, వీటీవీ గణేష్‌ పాత్రలు ఉండబోతోన్నాయి. ఇక అందరినీ సర్‌ప్రైజ్‌ చేసేందుకు బ్రహ్మానందం కూడా కనిపించబోతున్నారు. పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీని ఈనెల 16న మేకర్స్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సహ నిర్మాత – సోమరాజు పెన్మెట్సా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత – రాజీవ్‌ కుమార్‌ రామ, సంగీతం – ఆర్‌ఆర్‌ ధ్రువన్‌, సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్‌ ఎస్జె, ఎడిటింగ్‌ – పీకే, ప్రొడక్షన్‌ డిజైన్‌ – గాంధీ నడికుడికర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -