ఫారెస్ట్‌ ట్రేక్‌ పార్కులో పక్షుల వీక్షణ కార్యక్రమం

– ప్రారంభించిన టీఎస్‌టీడీసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.స్కైలాబ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ, హైదరాబాద్‌ బర్డింగ్‌ పాల్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని నార్సింగిలో ఫారెస్ట్‌ ట్రేక్‌ పార్క్‌లో బర్డ్‌ వాక్‌ (పక్షుల వీక్షణ) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీఎస్‌టీడీసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.స్కైలాబ్‌ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్కుకు వచ్చేవారందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..తాము అభివృద్ధి చేస్తున్న ప్రతి ఒక్క పార్కు కూడా పక్షులు, జంతువులు, లిజర్డ్స్‌, వీక్షకులకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక, నీడనిచ్చే జాతుల మొక్కలకు పార్కులో ఎక్కువగా నాటుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎకో టూరిజం ప్రాజెక్టు మేనేజర్‌ కల్యాణపు సుమన్‌, రేంజ్‌ ఆఫీసర్లు లక్ష్మారెడ్డి, మధు, సూపర్‌వైజర్‌ శ్రీకాంత్‌, బర్డింగ్‌ పాల్స్‌ కళ్యాణ్‌, విజరు, స్వాతి. తదితరులు పాల్గొన్నారు.

Spread the love