Sunday, October 12, 2025
E-PAPER
Homeసినిమావినోదం + సందేశం

వినోదం + సందేశం

- Advertisement -

క్రాంతి, అవితేజ్‌, ప్రదీప్‌, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఫెయిల్యూర్‌ బార్సు’. ఇతర కీలక పాత్రలను సుమన్‌, నాజర్‌, తనికెళ్ల భరణి పోషించారు. శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్‌ బ్యానర్‌ పై వీవీఎస్‌ కుమార్‌, ధన శ్రీనివాస్‌ జామి, లక్ష్మి వెంకట్‌ రెడ్డి నిర్మించారు. వెంకట్‌ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఫిలింఛాంబర్‌లో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. నిర్మాత ధన శ్రీనివాస్‌ జామి మాట్లాడుతూ, ‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా వినోదంతో పాటు మంచి సందేశాన్ని ఇచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మించాం. అన్నీ కుదిరితే ఈ నెలలోనే విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. చిత్ర నిర్మాణంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన నా స్నేహితుడు వెంకట్‌ రెడ్డికి థ్యాంక్స్‌’ అని తెలిపారు.

‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది. ప్రస్తుతం మా సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి’ అని మరో నిర్మాత లక్ష్మి వెంకట్‌ రెడ్డి అన్నారు.
నటుడు సూర్య మాట్లాడుతూ, ‘సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సుమన్‌, నాజర్‌, తనికెళ్ల భరణి లాంటి మంచి నటులు ఉన్నారు. యంగ్‌ టీమ్‌ అంతా ఈ సినిమాకు వర్క్‌ చేసింది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అందుకుని, దర్శక నిర్మాతలకు, మూవీ టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ఈ వేడుకలో ఈ చిత్రానికి పనిచేసిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ – ఎంఆర్‌ వర్మ, డీవోపీ – దాము నర్రావుల, మ్యూజిక్‌ – విజయ్ బుల్గానిన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -