Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదివాసీల పోరాట వీరుడు కొమురం భీమ్  85వ వర్ధంతి  

ఆదివాసీల పోరాట వీరుడు కొమురం భీమ్  85వ వర్ధంతి  

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
ఆదివాసీల పోరాట వీరుడు కొమరం భీమ్ 85వ వర్ధంతి సభను తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గొంది కిరణ్ అధ్యక్షతన ఆదివారం మండలంలోని పసర గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి సభకుముఖ్య అతిథులు గా ఆదివాసి ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ కమిటీ  చైర్మన్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్  హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగ నవనిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈనాడు రాజ్యాంగంలో ఏ ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ ను పొందుపరిచి హక్కుల కల్పించినారో  అదే షెడ్యూల్డ్ భూభాగం రావడానికి కావడానికి  ఆనాడే ఆదివాసీ సాయుధ యుద్ధ గోండు వీరుడు కుమ్రo భీమ్ దాదా ప్రత్యక్ష సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం రాజ్యంపై ఉద్యమించాడని ఆనాటి ఉద్యమాలే అదే వాదంతో నేడు మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న నినాదాలు అయినటువంటి నీళ్లు,నిధులు, నియామకాలు అనే విషయాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. 

అదే క్రమంలో ఈ రాజ్యం పీడిత వర్గాలలో చీలికలు తెచ్చే విధంగా భూస్వామ్య వర్గాలు కుట్రలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆదివాసిలు ఆదివాసి తెగలు ఉప తెగలు చైతన్యంతో అప్రమత్తంగా ఉండి మన జాతులకు అన్యాయం జరగకుండా ఉద్యమించాల్సిన అవసరం మన తుడుందెబ్బ పై బాధ్యత ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య  నాయక పోడ్ దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు ధబ్బా సుధాకర్ మాదిగ దండోరా జాతీయ నేత దళిత రత్న అవార్డు గ్రహీత నెమలి నర్సయ్య తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ములుగు జిల్లా కమిటీ సభ్యులు చింత కృష్ణ, ఆదివాసీ నాయక పోడ్ దెబ్బ పోలిట్ బ్యూరో సభ్యులు బొల్లెo సారయ్య తెలంగాణ ఎరుకల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కూరాకుల సమ్మయ్యఎరుకల తుడుం దెబ్బ ములుగు జిల్లా అధ్యక్ష అధికార ప్రతినిదులు దుగ్గారపు వీరభద్రమ్, సువర్ణపాక వెంకటరత్నం, చీమల శివకుమార్,  చింత వెంకటేష్, చందా మహేష్ , జిల్లా కార్యదర్సులు  ఈక జగ్గారావు  వట్టం సురేష్  ఎమ్మార్పీఎస్ గోవిందరావుపేట మండల అధ్యక్షులు ఎనగందుల మొగిలి మాదిగ ఏ ఎస్ యు ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాప అశోక్ ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మైపతి మీనాకుమారక్క, గోవిందరావుపేట గ్రామ అధ్యక్షులు కేశపాక కార్తీక్ మాదిగ, తదితరులతో వందలాది మంది ఆదివాసీ లతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -