నవతెలంగాణ -పరకాల
పరకాల కేంద్రంగా శాంపిల్ మందుల ( డ్రగ్స్) వ్యవహారం యెదేశ్చగా సాగుతోంది. సీనియర్ వైద్యుడు కదా అని చికిత్స కోసం వెళితే శాంపిల్ మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నా వైనం లక్ష్మి పిల్లల అండ్ జనరల్ నర్సింగ్ హోమ్ లో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వ్యవహారానికి సంబంధించి బాధితుల కథనం ప్రకారం.. శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన కోగిల సుధాకర్-బిందు దంపతుల కుమారుడు (20 నెలలు) ఈనెల 8 వతేదీన మంచం పైనుంచి కింద పడగా పన్ను విరిగింది. దాంతో పిల్లవాన్ని వారు పరకాల పట్టణంలోని లక్ష్మి పిల్లల అండ్ జనరల్ నర్సింగ్ హోమ్ కి చికిత్స నిమిత్తం తీసుకు వెళ్ళారు. అక్కడ పిల్లవాడిని పరిక్షించినా వైద్యులు డా.కాశయ్య చికిత్స చెసి మందులు రాయడం జరిగింది. అనంతరం పిల్లాడి తల్లిదండ్రులు పిస్క్రిప్షన్ తీసుకుని ఆసుపత్రిలోని వైద్యుడి తాలుకు మందుల షాపుకు వెళ్ళి మందులు ఇవ్వమనగా మెడికల్ షాపులో ఉన్నవారు శాంపిల్ మందులు అంటగట్టిన వైనాన్ని నవతెలంగాణ పత్రికకు వివరించారు.
పిల్లవాడు ఆపదలో ఉన్న బాధలో ఉన్న మేము ఇంటికి వెళ్ళాక పిల్లవాడికి మందులు వేయాలని చూడగా శాంపిల్ మందుల వ్యవహారం వెలుగు చూసిందన్నారు. చిన్నపిల్లలకు శాంపిల్ మందులను అంటగట్టడం ఎంతవరకు సమంజసం అంటూ సుధాకర్ దంపతులు ఆస్పత్రి వైద్యుడిపై మండిపడ్డుతున్నారు. మరునాడు ఆసుపత్రికి వెళ్లి నిలదీయడంతో తిరిగి వేరే మందులను ఇచ్చినట్లు తెలిపారు.
ఆస్పత్రి పై తక్షణమే చర్యలు చేపట్టాలి: సీపీఐ(ఎం) జిల్లా నాయకులు దొగ్గల తిరుపతి
లక్ష్మీ పిల్లల అండ్ జనరల్ నర్సింగ్ హోమ్ పై విచారణ జరిపించి తక్షణమే చర్యలు చేపట్టాలి. ఆస్పత్రి మెడికల్ షాపులో బహిరంగంగా శాంపిల్ మందులు విక్రయిస్తున్న డిఎం అండ్ హెచ్ ఓ, డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు ఏం చేస్తున్నట్లు..ఆ ఆస్పత్రిలోనే కాదు పరకాల కేంద్రంగా శాంపిల్ డ్రగ్స్ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతుంది. మీడియాలో అనేక కథనాలు వస్తున్నప్పటికీ డ్రగ్స్ కంట్రోలింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరకాల కేంద్రంగా సమగ్ర విచారణ జరిపి లక్ష్మీ పిల్లల అండ్ జనరల్ నర్సింగ్ హోమ్ తో పాటు, అన్ని మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించాలి.