Sunday, October 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీరాంసాగర్ రెండో దశకు మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గా నామకరణం

శ్రీరాంసాగర్ రెండో దశకు మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గా నామకరణం

- Advertisement -

24 గంటల్లోగా జీవో జారీ 
దామన్న కుటుంబానికి అండగా ఉంటాం
దామోదర్ రెడ్డి సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

శ్రీరాం సాగర్ రెండో దశకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 24
గంటల్లోగా దీనికి సంబంధించిన జీవో కూడా జారీ చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన దామోదర్ రెడ్డి సంతాప సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు అయి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అంతకంటే ముందు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఎస్సారెస్పీ-2 దశకు దామోదర్ రెడ్డి పేరు నామకరణంచేయడానికి రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం తెలుపవని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ 2 దశకు దామోదర్ రెడ్డి పేరు పెట్టడమే ఆయనకు ఇచ్చిన అసలైన నివాళులు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

అంతేకాదు ఆయనత్యాగాలు గౌరవాన్ని గుర్తిస్తాయని తెలిపారు.దామోదర్రెడ్డి మృతి చెందడం ఎంతో బాధాకరమని సంతాపాన్నిప్రకటించారు. తన జీవితమంతా ప్రజలకే అర్పించాడని పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి గాంధీ కుటుంబం అండగా ఉందని చెప్పమని సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పినట్లు పేర్కొన్నారు ఇప్పటికే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డికి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా లేఖ రాశారని గుర్తు చేశారు.

ముఖ్యంగా ఒకసారి రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు ఆస్తులు కూడా పెట్టుకుంటే 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి తన వారసత్వం నుండి వచ్చిన ఆస్తులను ప్రజల కోసం కరగదీశాడనిపేర్కొన్నారు. కక్షలు,కార్పన్యాలు,హత్య రాజకీయాలతో అట్టుడికి పోయిన తుంగతుర్తి ప్రాంతంలో వాటన్నింటినీ ఎదుర్కొంటూ కాంగ్రెస్ జెండాను నిలబెట్టాడని గుర్తు చేశారు. ఒకవైపు క్యాడర్ ను కాపాడుకుంటూనే మరోవైపు నీళ్లు లేక ఎడారిల మారిపోతూ ఫ్లోరైడ్ పట్టిపీడిస్తున్న తరుణంలో దామోదర్ రెడ్డి తుంగతుర్తి ప్రాంతానికి ఎస్సారెస్పీ నీళ్లు తేవడానికి ఉద్యమాలు సాగించాలని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి అండ దండగ నిలిచిన దామోదర్ రెడ్డి ఆశయాలను సాగిస్తూనే కుటుంబానికి అండదండగా ఉంటామని భవిష్యత్తులో సర్వోత్తమ్ రెడ్డికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీహెచ్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు ఎస్సారెస్పీ-2కి దామోదర్ రెడ్డి పేరు నామకరణం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒక వినతిపత్రం కూడా అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -