Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు

వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు

- Advertisement -

రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ 
నవతెలంగాణ – కామారెడ్డి 

తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) కామారెడ్డి జిల్లా మహాసభ ఆదివారం పట్టణంలో నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ హాజరయ్యారు. సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్యక్షతన  జరిగిన ఈ మహాసభకు జిల్లాలోని ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు, ల్యాబ్టెక్నిషన్ లు ఆరోగ్య మిత్రాలు, 104 ఎంప్లాయిస్ ఉద్యోగులు హాజరయ్యారు. 31 మంది తో జిల్లా కమిటీ వేశారు.  గౌరవ అధ్యక్షులు గా చంద్రశేఖర్ సిఐటియు, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు  జ్యోత్స్నదేవి, జిల్లా కార్యదర్శి అల్లాఉద్దీన్ లతో పాటు 11 మంది ఆఫీస్ బేరర్స్ గ ఎన్నిక అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ .. మెడికల్ డిపార్ట్మెంట్లోని కాంట్రాక్టర్, ఔట్సో ర్సింగ్ ఎంప్లాయిస్ అందరికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఏఎన్ఎంల పని భారం తగ్గించాలని,1930 ఏ ఎన్ ఎం పోస్టులు , 2300 నర్సింగ్ ఆఫీసర్స్, 1284 ఎల్ టి, 735 ఫార్మసిస్ట్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఆరోగ్య శ్రీ మిత్రల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 104 ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వాలని, స్వంతజిల్లాలో నియమించాలని కోరారు. కామారెడ్డి జిల్లా లోని ఔట్ సోర్సింగ్ ఏ ఎన్ ఏం , ఫార్మసిస్ట్ లను కాంట్రాక్టు పద్ధతిలో మార్చాలని కోరారు. గవర్నమెంట జనరల్ హాస్పిటల్ లో 8 మంది డిఈఓ లను తొలగించడం అన్యాయం అన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తామన్నారు. వచ్చే నెల నవంబర్ 9 న రాష్ట్ర మహాసభ సంగారెడ్డిలో ఉంటుందని ఉద్యోగులందరూ హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సిఐటియు నాయకులు కొల్లాపురం బాబు, జోత్స్న,సావిత్రి,అల్లాఉద్దీన్ ,స్వామి ,గంగాధర్,అన్నపూర్ణ, కవిత, సుజాత, కళ్యాణి, అమీనుద్దీన్, వీరేష్, ప్రభాకర్, దేవలక్ష్మి, వాణి, సుశీల, శోభ, సంగీత, మాధవి, రాజమణి, రాధిక, సునీత, బాలమణి, ప్రవీణ, శ్రీలత ,ఇమ్రాన్, రాథోడ్ నాయక్, శ్రీనివాస్, మల్లికార్జున్, శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -