బోరునవిలపించిన రైతు
పోలీసుల నిర్లక్ష్యమే అంటున్న బాధితుడు
నవతెలంగాణ – చిన్నకోడూరు
డ్రిప్పు పరికరాలను ధ్వంసం చేసిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. రైతు కర్నే శ్రీలత, కర్నే సత్తవ్వ తెలిపిన వివరాల ప్రకారం.. తనకున్న మూడున్నర ఎకరాల స్థలంలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటుకున్నామన్నారు. గత నెల 9 తేదీన మా పక్క రైతులు ఆయిల్ ఫామ్ మొక్కలను ధ్వంసం చేశారని తెలిపారు. మొక్కలను పీకేసిన వారిపై సిద్దిపేట పోలీస్ కమిషనర్, రూరల్ సీఐ, చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ఆదివారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లేసరికి డ్రిప్పు పైపులను కోసే వేసి, డ్రిప్పు బుడ్డితోపాటు డ్రిప్పు పరికరాలను మొత్తం ధ్వంసం చేసి ఉన్నాయన్నారు. గత నెలలోనే ఫిర్యాదు చేసినప్పుడే వారిపై కేసులు చేసి ఉంటే ఇప్పుడు ఇంత నష్టం జరిగేది కాదని, బిఆర్ఎస్ కు చెందిన నాయకులు కాబట్టి పోలీసులు వెనుకంజువేసారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.. పోలీసుల వైఫల్యం వల్లనే సుమారుగా లక్ష రూపాయల నష్టం జరిగిందన్నారు. పక్క రైతులతో మాకు ప్రాణ హని ఉందని బోరున విలపించారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలగజేసుకొని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.
డ్రిప్పు పరికరాలను ధ్వంసం చేసిన దుండగులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES