- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇందన్ పెల్లి రేంజ్ ఆఫీసర్ శ్రీధరచారి, ఇదే రేంజ్ లోని బంగారు తండా బీట్ ఆఫీసర్ ప్రణయ్ రెడ్డి లు సస్పెండ్ అయినట్లు తెలిసింది. ఇటీవల బంగారు తండా బీట్ లో సుమారు రూ. 4 లక్షల విలువ గల టేకు చెట్లు నరివేతకు గురయ్యాయి. దీనికి బాద్యులు చేస్తూ విధి నిర్వహణ లో నిర్లక్ష్యం వహించారనే నెపంతో వీరిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎఫ్డిపిటి శాంతారామ్ ను వివరణ కోరగా విధుల్లో నిర్లక్ష్యం వహించి బంగారు తండా బీట్ లో అక్రమంగా చెట్లు నరుకువేత కారణంగా వారిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు.
- Advertisement -