Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

శ్రమకు తగ్గ గౌరవ వేతనం ఇవ్వాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ – అచ్చంపేట
గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, శ్రమకు తగ్గ గౌరవ వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో టీఎన్జీఓ భవనంలో తెలంగాణ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ అధ్యక్షతన  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మూడావత్ శంకర్ నాయక్, డైలీవేజ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు భరత్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్, కే ఎన్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు జర్పుల శివ ప్రచండ, డీటీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి, సిఐటియు టౌన్ ప్రెసిడెంట్ రాములు, పౌర హక్కుల సంఘం జిల్లా నేతలు వెంకటేష్, బీఎస్పీ నియోజకవర్గ నాయకులు కృపానందం, తదితరులు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులు నేటికీ 31 రోజుల నుండి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ వారి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్లతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకోవడం సరైనది కాదన్నారు.

 తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్నమైన పద్ధతిలో ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉద్యమం ఉధృతం చేయాలని పోరాటాల ద్వారానే తమ హక్కులు సాధ్యం అవుతాయని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమం కొనసాగించాలని పిలుపునిచ్చారు. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 64 జీవో తీసుకొస్తే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలకు కోతలు విధించే జీవోను అమలు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారమే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డైలీ వెజ్ వర్కర్స్ 35 సంవత్సరాలుగా ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో పనిచేస్తున్నారని వారికి టైం స్కేల్ అమలు చేస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. డైలీ వేజ్ వర్కర్లు సమ్మె చేస్తే రోజుకు 1000 రూపాయలు ఇచ్చి హాస్టల్లో పనిచేయించుకుంటున్నా ప్రభుత్వ అధికారులు వీరికి వేతనాలు పెంచడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పర్వతాలు, ప్రజా సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు అంబేద్కర్ రిస్టులు  పౌర హక్కుల సంఘం  నాయకులు ఉన్నారురహక్కుల  సంగం నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -