- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కాంగ్రెస్ నేతలు ప్రతిదానికీ ఇంకా కేసీఆర్‌నే నిందిస్తున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ … జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కాంగ్రెస్ నేతలు ప్రతిదానికీ ఇంకా కేసీఆర్‌నే నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సిఎం రేవంత్ రెడ్డిని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
- Advertisement -