నవతెలంగాణ – ఊరుకొండ
నాగర్ కర్నూల్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఊరుకొండ మండలం నేటితో 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో ఊరుకొండ మండల ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నవభారతి అసోసియేషన్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ మ్యాకల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పరిపాలన సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలు మరియు కొత్త మండలాల ఏర్పాటు కొరకు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి మండల ఏర్పాటుకు సహకరించారని తెలిపారు.
మండల ఏర్పాటులో అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమకారులు, అనేక సంఘాలు కలిసి మండల ఏర్పాటును సాధించుకున్నామన తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆవిర్భావ మెమొంటోళ్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వీరారెడ్డి, సీనియర్ నాయకులు బక్క జంగయ్య, బి.రమేష్, కలిం పాషా,ముచ్చర్ల లక్ష్మారెడ్డి, మనోహర్, శీను, గోపీ, సందీప్ కుమార్, మల్లేశ్, సురేష్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఊరుకొండ మండల ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES