Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గఫూర్ శిక్షక్ ను అభినందించిన నలిమెల భాస్కర్

గఫూర్ శిక్షక్ ను అభినందించిన నలిమెల భాస్కర్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రముఖ కవి రచయిత  గఫూర్ శిక్షక్  రచనలు చాలా బాగుంటాయని  సమాజానికి అవసరమైన కవిత్వాన్ని గఫూర్ శిక్షక్  రాస్తున్నాడన్నారు. కవిత్వంలో నిండైన భావనలు లోతైన ఆలోచనలు దూరదృష్టి కలిగిన రచనలు ఎంతో ఆకట్టుకుంటాయని  జనం కోసం ప్రజల సమస్యల పరిష్కార దిశలో తన రచనలు సాగుతుంటాయని మంచి రచనలు చేసే గఫూర్ శిక్షక్ కవిత్వం ఎంతో ఆలోచింపజేస్తుందని, మరిన్ని మేటి రచనలు సమాజానికి అందించాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత  బహుభాషా వేత్త సుప్రసిద్ధ రచయిత అనువాదకులు  డాక్టర్ నలిమెల భాస్కర్ అన్నారు. కరీంనగర్ లో జరిగిన సాహితీ సమావేశంలో  గఫూర్ శిక్షక్ నలిమెల భాస్కర్ ను కలిసి తన పుస్తకాలు ధైర్య కవచం,  యుద్ధ గీతం, దీర్ఘ కవిత పుస్తకాలను నలిమెల భాస్కర్ కు అందజేశారు. ఈ సందర్భంగా గఫూర్ శిక్షక్ ను ఆయన అభినందించారు. యుద్ధ గీతం దీర్ఘ కవిత చాలా ఆలోచింపజేసేదిగా ఉన్నదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -