నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డ్రాగన్ షోటో ఖాన్ కరాటే డు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో గద్వాల్ పట్టణంలోని బెటర్ లైఫ్ మోడల్ స్కూల్ పాఠశాలలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 110 మంది విద్యార్థులకు ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, బ్లూ, మెరూన్, బ్రౌన్, బ్లాక్ బెల్టు మరియు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఈ బెల్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం చాలా సంతోషమని చెప్పడం జరిగింది నేటి సమాజంలో చదువుతోపాటు, క్రీడారంగంలో, కరాటే చాలా అవసరం అని పేర్కొన్నారు.
నేటి సమాజంలో మహిళల పైన జరుగుతున్నటువంటి అగత్యాలను అరికట్టడానికి కరాటే ఎంతో అవసరం అని వారు చెప్పడం జరిగింది ఈ కరాటే నేర్చుకోవడం చేత చదువులో రాణిస్తారని చదువులో ఏకాగ్రత పెరుగుతుందన్నారు అదేవిధంగా శారీరక దృఢత్వం మరియు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే ప్రాముఖ్యాన్ని అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, క్లబ్ ఫౌండర్ సలాం బిన్ ఉమర్, సెక్రటరీ షేక్ అబ్దుల్ సలాం, చీఫ్ ఎగ్జామినర్ అమ్రేష్, శివాజీ, హితేష్, శ్రీనివాస్ రెడ్డి, క్లబ్ సలహాదారులు కె. వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ జద్దాలే, కరాటే మాస్టర్ మొహమ్మద్ అర్ఫత్, మోసిన్, ఎం.డి. సుల్తాన్, కె.వరుణ్ సందేష్, అబుజార్, విజయ్, ఆకాష్, నరసింహ, కె.ప్రశాంత్, యాసీన్, కె.ఇందు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.