Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్త్వరలో జిల్లా కురుమ యువచైతన్య సమితి నూతన కమిటీ ఏర్పాటు

త్వరలో జిల్లా కురుమ యువచైతన్య సమితి నూతన కమిటీ ఏర్పాటు

- Advertisement -

– జిల్లా కురుమ యువ చైతన్య సమితి నాయకులు 
నవతెలంగాణ –  కామారెడ్డి

రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి కురుమ యువచైతన్య సమితి ( కేవైసీఎస్ ) కమిటీ ఎన్నికలను నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు కామారెడ్డి జిల్లా కురుమ యువ చైతన్య సమితి నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమితి బైలాస్ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కమిటీ మార్పు జరగాలి. ప్రస్తుతం ఉన్న కమిటీకి రెండు సంవత్సరాలు ఆరు నెలలు పూర్తయ్యాయి. నూతన కమిటీని ఏర్పరచడం అవసరమైందన్నారు. జిల్లా కమిటీ పునఃప్రక్షాళన కార్యక్రమం బుధవారం రోజు జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందనే ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ కులస్తులు, సమితి సభ్యులు, నాయకులు అందరూ పాల్గొని నూతన కమిటీ ఎన్నికలను విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర కమిటీ తరపున కోరుతున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -